సైనిక అధికారుల ఇళ్లపై దాడి వెనుక మాస్టర్ మైండ్స్ వీరే!
- హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాఉద్దీన్, జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్
- దాడికి ముందు మాట్లాడుకున్న ఇద్దరు ఉగ్రనేతలు
- వెల్లడించిన నిఘా వర్గాలు
ముజఫరాబాద్ లో రెండు గ్రూపులూ కలసి ఓ టెర్రరిస్టు క్యాంపును నిర్వహించి, ఉగ్రవాదులకు శిక్షఇ ఇచ్చి పంపారని వెల్లడించాయి. వీరు ఏకే-47 తుపాకులు, ఇతర ఆయుధాలు తీసుకుని వచ్చారని, ఎన్ కౌంటర్ అనంతరం ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. వారి వద్ద లభించిన వస్తువులను పరిశీలించిన తరువాత వారు జైషే మొహమ్మద్ కు చెందిన వారని ఖరారైందని తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో 9 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని రక్షణ శాఖ ప్రజా సంబంధాల అధికారి ఒకరు వెల్లడించారు.