Drunk Driving: తప్ప తాగి బెంజ్ కారులో వచ్చి... పోలీసులపై అమ్మాయిల చిందులు... వీడియో చూడండి!

షార్ట్స్‌లో చూడండి
గత రాత్రి హైదరాబాదులో మందుబాబులు రెచ్చిపోయారు. వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా, మొత్తం 105 మంది మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడ్డారు. జూబ్లీహిల్స్ లో మందు కొట్టి, ఖరీదైన బెంజ్ కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఓ యువతి, తనను అడ్డుకున్న పోలీసులపై చిందులు తొక్కింది. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలకు సహకరించకుండా వారి సహనానికి పరీక్షగా నిలిచింది.

దీంతో మహిళా కానిస్టేబుళ్లు రంగ ప్రవేశం చేసి ఆమెకు పరీక్ష చేయాల్సి వచ్చింది. సదరు యువతి మీడియా కెమెరాలను నాశనం చేసేందుకు చూసింది. తనను వీడియో తీస్తున్న కెమెరామెన్ వెంట పడింది. సికింద్రాబాద్ కు చెందిన వ్యాపారి రాహుల్, అతని గర్ల్ ఫ్రెండ్ కూడా పోలీసుల ముందు నానాయాగీ చేశారు. వివిధ ప్రాంతాల్లో జరిపిన తనిఖీల తరువాత మొత్తం 42 కార్లు, 61 ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలనూ సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.

తామెంత విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నా, మందుబాబులు మెట్టుదిగడం లేదని, తనిఖీలను మరింతగా పెంచుతామని పోలీసు అధికారులు వెల్లడించారు. పోలీసులతో వాదనకు దిగిన అమ్మాయిల వీడియోను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Drunk Driving
Police
Hyderabad
Hulchal

More Telugu News