Sunny Leone: బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్‌పై కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు

  • సన్నీలియోన్‌పై సామాజిక కార్యకర్త ఫిర్యాదు
  • పోర్నోగ్రఫీని ప్రచారం చేస్తోందని ఆరోపణ
  • దేశ  సంస్కృతి సర్వనాశనం కాకముందే అడ్డుకోవాలన్న ఫిర్యాదుదారు
బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీలియోన్‌పై చెన్నైలో కేసు నమోదైంది. సన్నీ పోర్నోగ్రఫీని ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త ఎమీ అక ఎనోక్ మోసెస్ నజరత్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఆమె పోర్నోగ్రఫీని ప్రచారం చేస్తోందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనివల్ల దేశ సంస్కృతి దెబ్బతినే అవకాశం ఉందని వాపోయారు.

నైతికత సర్వనాశనం అయిపోతుందని,  ప్రజల వస్త్రధారణలో మార్పు వస్తుందని పేర్కొన్నారు. కాబట్టి దీనిని ముందుగానే అడ్డుకోవాలని కోరారు. సన్నీలియోన్ ప్రస్తుతం ‘వీరమదేవి’ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె రాణిగా నటిస్తోంది. ఇందుకోసం కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీ నేర్చుకుంది.
Sunny Leone
pornography
Bollywood
Chennai

More Telugu News