Kakinada: కాకినాడ టూ కోటిపల్లి... ఏపీలో పరుగులు తీయనున్న రైల్ బస్సు!

  • ఈనెల 13 నుంచి ప్రారంభం
  • ప్రజలకు మహాశివరాత్రి కానుక
  • ఒకే బోగీతో నడిచే రైల్ బస్
కోస్తా తీరవాసులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కాకినాడ - కోటిపల్లి - కాకినాడ రైల్ బస్సు ఈ నెల 13న పట్టాలెక్కనుంది. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న రైల్ బస్, మహా శివరాత్రి నుంచి రెగ్యులర్ గా తిరుగుతుందని అధికారులు వెల్లడించారు. సాధారణ రైల్ మాదిరిగా కాకుండా, ఒక్క బోగీతోనే ఇది నడుస్తుంది. బోగీలో బస్సులో మాదిరిగా సీట్లుంటాయి. కాకినాడలో ఉదయం 9.30 గంటలకు బయలుదేరే రైల్ బస్సు ఉదయం 11.30కి కోటిపల్లి చేరుకుంటుంది. ఆపై కోటిపల్లిలో 12 గంటలకు బయలుదేరి కాకినాడకు 2 గంటలకు చేరుతుంది. మార్గమధ్యంలో కొవ్వాడ ఆర్తలకట్ట, కరప, వాకాడ, వేళంగి, నరసాపురపుపేట, రామచంద్రాపురం, ద్రాక్షారామం, కుందూరు, గంగవరం స్టేషన్లలో ఆగుతుంది.
Kakinada
Kotipalli
Rail Bus

More Telugu News