Telangana: తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రిటెక్ -2018 ప్రదర్శన.. చిత్రమాలిక!

  • ఈ ప్రదర్శనకు అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థులు, రైతులు
  • నూతన వంగడాలపై సమగ్ర వివరాలు  
  • విక్రయానికి ఔషధ మొక్కలు, చిరుధాన్యాలతో చేసిన పదార్థాలు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన అగ్రి టెక్ - 2018 ప్రదర్శన ఆకట్టుకొంటోంది. ఈ ప్రదర్శనను తిలకించేందుకు విద్యార్థులు, రైతులు, ఆసక్తిగల వారు హాజరవుతున్నారు. విశ్వవిద్యాలయం రూపొందించిన నూతన వంగడాలు, నీటి యాజమాన్యం, నీటి సాంకేతిక పరిజ్ఞానం, తెగుళ్లు, పురుగులు, ఎరువుల యాజమాన్యంపై సమగ్ర వివరాలను అందజేస్తున్నారు.

వరి, మొక్కజొన్న, అపరాల పంటలు, పశుగ్రాస పంటలపై లైవ్ మోడళ్లను ప్రదర్శించారు. గృహ విజ్ఞాన విభాగం ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో తయారు చేసిన పదార్థాలను ఈ ప్రదర్శనలో విక్రయానికి ఉంచారు. రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలోని, ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో ఔషధ మొక్కలను విక్రయానికి ఉంచారు. ఎక్స్ పిరియన్షల్ లెర్నింగ్ పథకంలో భాగంగా విద్యార్థులు మొక్కలు విక్రయిస్తున్నారు.

కాగా, ఈ ప్రదర్శనను తిలకించేందుకు కరీంనగర్, కొత్తగూడెం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల నుంచి రైతులు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు, బీఎస్సీ అగ్రికల్చరల్ విద్యార్థులు హాజరయ్యారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన చిత్రాలు..
Telangana
agri tech -2018

More Telugu News