Harish Rao: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు

  • హరీశ్ రావుకి టీటీడీ అధికారుల సాదర స్వాగతం
  • రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న హరీశ్ రావు
  • పద్మావతీనగర్‌లోని రాధేయం గెస్ట్ హౌస్ లో బ‌స
తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు తిరుమ‌ల‌ చేరుకున్నారు. ఆయ‌న‌కు టీటీడీ అధికారులు సాద‌ర‌ స్వాగతం పలికారు. రేపు ఉద‌యాన్నే ఆయ‌న తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. రేపు ఉదయం నైవేద్య విరామ సమయంలో హ‌రీశ్ రావు కుటుంబం మొక్కులు చెల్లించుకోనున్నట్లు తెలిసింది. హరీశ్ రావు కుటుంబం పద్మావతీనగర్‌లోని రాధేయం గెస్ట్ హౌస్ లో బ‌స చేస్తున్నారు. హ‌రీశ్ రావు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌త్యేక స‌దుపాయాలు క‌ల్పించారు.      
Harish Rao
Telangana
TTD

More Telugu News