reddy degree college: హైదరాబాదులో ఇద్దరు కాలేజీ విద్యార్థినుల అదృశ్యం

  • నారాయణగూడలోని రెడ్డి డిగ్రీ కాలేజీలో చదువుతున్న చామంతి, దివ్య
  • నిన్న కాలేజీకి వెళ్లిన విద్యార్థినులు
  • మిస్సింగ్ పై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాదులో డిగ్రీ చదువుతున్న ఇద్దరు కాలేజీ విద్యార్థినులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నారాయణగూడలోని రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు చామంతి (18), దివ్య (20) లు నిన్నటి నుంచి కనిపించడం లేదు. కాలేజీకని వెళ్లిన విద్యార్థులు కాలేజీ ముగిసినా ఇంటికి రాలేదని కళాశాల యాజమాన్యానికి వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
reddy degree college
narayanaguda
Hyderabad

More Telugu News