mohan babu: నేనంటే భయపడటానికి అదే కారణం కావొచ్చు!: మోహన్ బాబు

  • నేనంటే భయమెందుకనేది వాళ్లనే అడగండి
  • వాళ్లు ఏమన్నారనేది నాకు చెప్పండి 
  • నా సిన్సియారిటీనే కారణమని నేను అనుకుంటున్నాను
"మోహన్ బాబు అంటే చాలామందికి తెలియని ఓ భయం వుంది .. ఎందుకురా బాబూ ఆయనతో అనే ఫీలింగ్ వుంది. ముఖ్యంగా కొత్త దర్శకులు మీ వరకూ రావాలంటేనే భయపడుతున్నారు. మీరు కొంచెం స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తే, మీ కోసం అద్భుతమైన పాత్రలను సృష్టించడానికి రెడీగా వున్నారు. దీనికి మీరేమంటారు?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ నుంచి మోహన్ బాబుకు ఎదురైంది.

అందుకాయన స్పందిస్తూ ..  "స్నేహ పూర్వక వాతావరణం అంటే ఏమిటీ .. పిలిచి మందివ్వాలా .. క్లబ్ కి తీసుకెళ్లాలా? అంటూ మోహన్ బాబు ఎదురు ప్రశ్నించారు. నేనంటే భయమెందుకనే ప్రశ్నను వాళ్లనే అడగండి. వాళ్లు ఏం చెప్పారనేది వచ్చి నాకు చెప్పండి .. అప్పుడు నేను మాట్లాడతాను. తమ సినిమాల్లో నాకు అవకాశం ఇవ్వడం .. ఇవ్వకపోవడం ఆ దర్శకుల నిర్ణయం. నా టాలెంట్ వాళ్లకి నచ్చొచ్చు .. నచ్చకపోవచ్చు. ఇక నేనంటే భయపడటానికి కారణం నా సిన్సియారిటీ .. డిసిప్లీన్ .. నా పద్ధతులు కారణం కావొచ్చని నా కనిపిస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు.  

mohan babu

More Telugu News