mohan babu: నా తరువాత వచ్చిన హీరోలు కొంతమంది నా గురించి బ్యాడ్ గా ప్రచారం చేశారు: మోహన్ బాబు

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై విలక్షణ నటుడిగా మోహన్ బాబు తన విశ్వరూపం చూపుతూ వస్తున్నారు. తాజాగా ఐ డ్రీమ్స్ తో ఆయన మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "గౌరవాలు రెండు రకాలుగా ఉంటాయి .. భక్తితో ఇచ్చేది .. భయంతో ఇచ్చేది. మోహన్ బాబుకు ఇండస్ట్రీ ఎలాంటి గౌరవం ఇస్తోంది?" అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

'అది ఎలా చెప్పగలను బ్రదర్ .. అంతా నవ్వుతూనే పలకరిస్తారు. ఎవరి నవ్వు వెనుక ఏవుందో ఎవరికి తెలుసు? నేనెవరికీ ఎప్పుడూ చెడు చేయలేదు గానీ, నా తరువాత వచ్చిన కొంతమంది హీరోలు నా గురించి చెడుగా ప్రచారం చేశారు. ఒక హీరోయిన్ .. ఓ సినిమా షూటింగుకి ఆలస్యంగా వెళుతుంది. అప్పటివరకూ ఆమెను తిట్టుకున్న హీరో .. ఆమె కనిపించగానే ఆనందంగా పలకరిస్తాడు.

నాతో ఓ సినిమా చేస్తున్నట్టుగా ఆమె చెబితే, అక్కడున్న హీరో నా గురించి చెడుగా చెప్పి ఆమెను భయపెట్టేవాడు. 'ఇక్కడి షూటింగుకి ఆలస్యంగా వచ్చినా మేం ఒప్పుకున్నాం .. రేపు మోహన్ బాబు షూటింగుకి ఆలస్యంగా వెళ్లు .. అప్పుడు తెలుస్తుంది' అనేవాళ్లు. దాంతో భయపడిపోయిన ఆ హీరోయిన్స్ ఇచ్చిన డేట్స్ కూడా ఎగ్గొట్టేసేవాళ్లు. అలాంటి మాటలను లెక్కచేయని హీరోయిన్లు కూడా వున్నారు. అంటూ చెప్పుకొచ్చారు.      
Go Back to Shorts
mohan babu

More Telugu News