Kadapa District: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముస్లిం మతపెద్ద దుర్మరణం

షార్ట్స్‌లో చూడండి
కడప జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దువ్వూరు మండల పరిధిలో గల జాతీయ రహదారిపై జరిగిన ఈ యాక్సిడెంట్ లో ముస్లిం మతపెద్ద ఖాజీ సయ్యద్ నజరుల్లా సాహెబ్ (65) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఆమెను చాగలమర్రిలోని ఓ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఓ ఎడ్లబండిని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సయ్యద్ నజరుల్లా ఉర్దూ లెక్చరర్ గా కూడా పని చేసి రిటైర్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Kadapa District
accident
khaji sayyed nazarullah saheb

More Telugu News