Pawan Kalyan: చెల్లెలు కవితకు ధన్యవాదాలు!: పవన్ కల్యాణ్

  • ఏపీ హక్కులపై పార్లమెంటులో మాట్లాడిన కవిత
  • ఏపీకి మద్దతుగా ఉంటామని ప్రకటన
  • ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్
టీఆర్ఎస్ ఎంపీ కవితకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. 'రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పార్లమెంటులో మాట్లాడిన చెల్లెలు కవిత గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ఏపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఎంపీలే ఆందోళన కార్యక్రమాలను చేపడితే, దేశ ప్రజలకు నెగెటివ్ మెసేజ్ వెళుతుందని... హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే కవితకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
Pawan Kalyan
K Kavitha
Special Category Status
Andhra Pradesh
parliament

More Telugu News