maniratnam: దర్శకుడు మణిరత్నం కొత్త చిత్రం 'నవాబ్'!

  • ప్రధాన పాత్రల్లో అరవింద్ స్వామి, సిలంబరసన్, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి
  •  సంగీతం ఏఆర్ రెహ్మాన్   
  • ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన మణిరత్నం
దర్శకుడు మణిరత్నం తన తదుపరి తమిళ, తెలుగు చిత్రాన్ని ఈరోజు ప్రకటించారు. తమిళంలో దీని పేరు ‘చెక్కా చివంత వానం’ కాగా, తెలుగులో 'నవాబ్'. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నలుగురు నటులు అరవింద్ స్వామి, సిలంబరసన్, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి ఉన్నారు. మణిరత్నం సొంత సంస్థ అయిన మద్రాసు టాకీస్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో జ్యోతిక, జయసుధ, ప్రకాష్ రాజ్, త్యాగరాజన్, అదితిరావ్ హైదరి, మోడల్ దయానా ఎర్రప్ప, మన్సూర్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న దీనికి షరా మామూలుగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.   
maniratnam
chekka chivanta vaanam

More Telugu News