Harish Rao: సిద్ధిపేట స్టేడియంలో టాస్ వేసి.. టీ20 ఆటను ప్రారంభించిన హరీశ్ రావు

  • లీగ్ మ్యాచ్ లకు అతిథ్యం ఇచ్చిన ఆచార్య జయశంకర్ క్రికెట్ స్టేడియం
  • సిద్ధిపేట స్టేడియంకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా చేస్తా
  • త్వరలో క్రీడా హబ్ గా సిద్ధిపేట- హరీశ్ రావు

సిద్ధిపేటలో మొదటిసారిగా స్థానిక క్రికెట్ టోర్నీ టీ20 లీగ్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. సిద్ధిపేట మినీ స్టేడియంలో టీ 20 క్రికెట్ మ్యాచ్ ను చూడడానికి వచ్చిన మంత్రి హరీశ్ రావు టాస్ వేసి ఆటను ప్రారంభించారు. దీంతో సిద్ధిపేటలో క్రికెట్ కోలాహలం మొదలైంది. సిద్దిపేటలో టీ20 లీగ్ మ్యాచ్ లు జరగడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ స్టేడియంకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానని హరీశ్ రావు ప్రకటించారు.

ప్రత్యేకంగా ఇక్కడ ఈ లీగ్ మ్యాచ్ లు జరగడానికి కృషి చేసిన హెచ్‌సీఏ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రెండవ వేదిక గా సిద్ధిపేట స్టేడియాన్ని ఎంపిక చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్టేడియం అభివృద్ధి చేయడానికి ఇక్కడ క్రీడాకారుల్లో ఉత్సహమే కారణమని మంత్రి వ్యాఖ్యానించారు. సిద్ధిపేట క్రీడాకారుల్లో ఉన్న ఆసక్తి తోనే మినీ స్టేడియం అభివృద్ధి చేశామన్నారు. త్వరలో సిద్ధిపేటను క్రీడా హబ్ గా చేస్తామని హరీశ్ రావు చెప్పారు.

డే అండ్ నైట్ మ్యాచ్ లు అయ్యే విధంగా 15 రోజుల్లో ప్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉండి సహకారం అందిస్తానన్నారు. క్రికెట్ తో పాటు అథ్లెటిక్ లాంటి వాటిలో కూడా ముందు ఉండాలని సూచించారు. స్థానిక క్రీడా కారులు రాష్ట్ర , జాతీయ స్థాయిలో క్రికెట్ పోటీల్లో పాల్గొనాలని అభిలషించారు. అంతర్జాతీయ గుర్తింపు వచ్చే విధంగా స్టేడియాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇక్కడ అంతర్జాతీయ, జాతీయ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించే విధంగా కృషి చేస్తానని అన్నారు.

ఆ స్థాయిలో ఇక్కడి క్రీడాకారులు ఎదగాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను, క్రీడా కారులను గుర్తించేందుకు ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా క్రీడా రంగాన్ని బలోపేతం చేయడానికి మైదానాలు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఇంత గొప్ప అవకాశాన్ని పట్టణ, గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు తెలిపారు.

కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ విద్యా క్షేత్రంగా చేసుకున్నట్టు హరీశ్ రావు చేప్పారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు అవుతోందని, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు పరుచుకొని  పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందేలా కృషి చేస్తున్నామన్నారు.

More Telugu News