sai dharam tej: సాయిధరమ్ .. చిరంజీవిని గుర్తుచేశాడట!
- ఈ రోజునే విడుదలైన 'ఇంటిలిజెంట్'
- నటన పరంగా తేజుకి మరిన్ని మార్కులు
- ఫైట్స్ తో మాస్ ను మెప్పించిన తేజు
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'ఇంటిలిజెంట్' .. ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాయిధరమ్ తేజ్ ఎదుగుదలకు నాజర్ ఎంతగానో సాయపడతాడట. అలాంటి ఆయన ప్రాణాలు తీసిన శత్రువులపై సాయిధరమ్ తేజ్ పగ తీర్చుకునే కథతో ఈ సినిమా కొనసాగుతుందట. ఈ పాత్రలో సాయిధరమ్ తేజ్ చాలా బాగా చేశాడడనేది టాక్.
కొత్త లుక్ తో కనిపిస్తూ .. తనదైన స్టైల్ తో మెప్పించాడని అంటున్నారు. ఫైట్స్ తో మాస్ ఆడియన్స్ నుంచి మరోమారు మంచి మార్కులు కొట్టేశాడని చెబుతున్నారు. ఇక రీమిక్స్ చేసిన 'ఛమక్ ఛమక్ ఛామ్' సాంగ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచిందని అంటున్నారు. ఈ పాటలో సాయిధరమ్ తేజ్ .. చిరూను గుర్తు చేశాడనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జయాపజయాల గురించి పక్కన పెడితే, ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ మరింత దూకుడు చూపించాడనే చెబుతున్నారు.