Madhya Pradesh: నిరుపేద అమ్మాయికి తమ సొంత ఖర్చులతో ఘనంగా పెళ్లి చేసిన పాఠశాల టీచర్లు!

షార్ట్స్‌లో చూడండి
మ‌ధ్యప్ర‌దేశ్‌ విడిశాలోని పిప‌ర్‌గుహ ప్ర‌భుత్వ పాఠ‌శాల ఉపాధ్యాయులు అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఆ గ్రామంలోని ఓ నిరుపేద యువ‌తికి పెళ్లి జ‌రిపించారు. ఇటువంటి కార్య‌క్ర‌మాల‌ను భ‌విష్య‌త్తులోనూ కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. ఆ యువ‌తికి పెళ్లి జ‌రిపించ‌డానికి వారు ఎవ్వ‌రి వ‌ద్దా ఫండ్స్ కూడా తీసుకోలేదు. ప్ర‌తి నెల‌ త‌మ వేత‌నాల్లోంచి కొంత డ‌బ్బుని నిరు పేద ఆడ‌పిల్ల‌ల కోసం పొదుపు చేస్తున్నామ‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌యిన బేటీ బ‌చావో బేటీ ప‌డావోకి కూడా త‌మ సేవ‌ల‌ను అందిస్తామ‌ని తెలిపారు. తాజాగా వారు ఓ నిరుపేద అమ్మాయికి జ‌రిపించిన పెళ్లి వేడుక వీడియోను మీరూ చూడండి...  
Go Back to Shorts
Madhya Pradesh
marriage
underprivileged
girl

More Telugu News