somu veerraju: అమిత్ షా నాకు ఫోన్ చేయలేదు.. కావాలంటే నా కాల్ డేటా చూసుకోండి!: సోము వీర్రాజు

  • అమిత్ షా నన్ను మందలించలేదు
  • నా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది
  • టీడీపీ, వైసీపీలు మైలేజ్ కోసం పాకులాడుతున్నాయి
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తనను మందలించారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కావాలంటే తన కాల్ డేటా చూసుకోవచ్చని చెప్పారు. తన గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. తనను వైసీపీ కోవర్టు అంటూ చేస్తున్న ఆరోపణలు వింటుంటే నవ్వొస్తోందని చెప్పారు.

ఏపీలో మైలేజీ కోసమే టీడీపీ, వైసీపీలు పాకులాడుతున్నాయని విమర్శించారు. పవన్ ప్రకటించిన జేఏసీ ఏర్పాటు మంచిదేనని చెప్పారు. రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం నెలకొందని... దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు.
somu veerraju
Telugudesam
YSRCP
BJP

More Telugu News