హీరో నాగశౌర్య గురించి మెగా హీరోయిన్ స్పందన!
- నాగశౌర్య నాకు మంచి స్నేహితుడు మాత్రమే
- ఇంతకు మించి మా మధ్య మరేదీ లేదు
- నా కజిన్స్ తో ముడిపెట్టి కూడా వార్తలు రాశారు
మిగిలిన కో-ఆర్టిస్టుల్లానే నాగశౌర్య కూడా తనకు ఒక మంచి మిత్రుడని నిహారిక చెప్పింది. దీనికి మించి తమ మధ్య మరేదీ లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు నాగశౌర్యకు, తనకు లింక్ పెట్టారని, ఇంతకు ముందు వేరొకరితో లింక్ పెట్టారని చెప్పింది. చివరకు తన కజిన్స్ తో కూడా ముడిపెట్టి వార్తలు రాశారని ఆవేదన వ్యక్తం చేసింది. మొదట్లో ఇలాంటి వార్తలతో తనకు బాధ అనిపించేదని, ఇప్పుడు అలవాటై పోయిందని చెప్పింది.