lottery: అదృష్టం తలుపుతట్టింది.. దురదృష్టం ప్రాణం తీసింది!

షార్ట్స్‌లో చూడండి
థాయిలాండ్ లో జిరావుట్ పొంగ్‌ ఫాన్‌ (40) కు అదృష్టం కలిసిరాగా, దానిని దురదృష్టం తీసుకెళ్లిపోయింది. దాని వివరాల్లోకి వెళ్తే... జిరావుట్ కు 8.5 కోట్ల రూపాయల విలువైన లాటరీ తగిలింది. భారీ మొత్తం లాటరీ తగలడంతో ఆ డబ్బుతో ఏం చేయాలో లెక్కలన్నీ వేసుకున్నాడు. లాటరీ టికెట్ నెంబర్ తనదేనని, అయితే, టికెట్ పోయిందని చెబుతూ, తనకు ఆ డబ్బులు ఇవ్వాలని లాటరీ నిర్వాహకులను కోరాడు.

అయితే లాటరీ టికెట్ ఉంటేనే డబ్బు ఇస్తామని వారు జిరావుట్ కు స్పష్టం చేశారు. ఇంటికొచ్చి లాటరీ టికెట్ కోసం వెదికిన జిరావుట్ కు అది కనిపించలేదు. దీంతో కన్న కలలన్నీ ఆవిరైపోవడంతో సూసైడ్ నోట్ రాసి, తలకు తుపాకీ గురిపెట్టుకుని కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడు. లాటరీ తమ కుమారుడ్ని అంతమొందించిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. 
Go Back to Shorts
lottery
thailand
sucide

More Telugu News