Meghana: హల్ చల్ చేస్తున్న మేఘన ర్యాగింగ్ వీడియోలు!

షార్ట్స్‌లో చూడండి
బెంగళూరులో కలకలం రేపిన మేఘన ఆత్మహత్య కేసుకు సంబంధించి మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చదువులో చక్కగా రాణించి, యశ్వంతపుర పరిధిలోని దయానంద సాగర కాలేజీలో ఉచిత సీటు తెచ్చుకుని, ఇంజనీరింగ్ చదువుతున్న మేఘన, క్లాస్ లీడర్ పోటీల్లో ఓడిపోగా, ఆమెను ఓడించిన గ్రూప్ నిత్యమూ ర్యాగింగ్ చేస్తూ, మానసిక క్షోభకు గురిచేస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ కేసులో ర్యాగింగ్ కు, కళాశాలకు సంబంధం లేదని యాజమాన్యం వాదిస్తుండగా, మేఘనను కాలేజీలో ఏడిపిస్తున్న వీడియోలు ఇప్పుడు విడుదలై కలకలం రేపుతున్నాయి. కాలేజీ క్యాంపస్ లో తోటి విద్యార్థినీ విద్యార్థులు ఆమెతో అవమానకరంగా మాట్లాడుతూ, దాడికి యత్నించిన దృశ్యాలు చక్కర్లు కొడుతుండగా, దీన్ని సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానిత విద్యార్థినులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి సెల్ ఫోన్లను పరిశీలించగా, మేఘనను ర్యాగింగ్ చేస్తూ, దాన్ని వీడియో తీసి పైశాచికానందాన్ని పొందినట్టు వెల్లడైంది.
Go Back to Shorts
Meghana
Karnataka
Bengalore
Sucide

More Telugu News