Prime Minister: సభలో కాబట్టి మోదీ సేఫ్.. బయట మాట్లాడుంటేనా?: రేణుకా చౌదరి
- ఆధార్ వద్దని మోదీ పెద్ద ప్రసంగమే చేశారు
- ఇప్పుడు ఆధార్ తమ ఆలోచనేనని గొప్పగా చెప్పుకుంటున్నారు
- తనపై వ్యాఖ్యలు బయట చేసుంటే కేసునమోదై ఉండేది
రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ మధ్యలో నవ్విన రేణుకా చౌదరిని ఉద్దేశించి రామాయణ్ సీరియల్ తరువాత అలాంటి నవ్వును వినే భాగ్యం దక్కిందన్న వ్యాఖ్యలపై రేణుకా చౌదరి మాట్లాడుతూ, గతంలో ప్రధాని మోదీ ఆధార్ కార్డు అవసరం లేదని పెద్ద ప్రసంగమే చేశారని గుర్తు చేశారు. అలాంటి మోదీ ఇపుడు ఆధార్ ను పుట్టించినదే తాము అని చెబితే నవ్వకుండా ఉండగలమా? అని అన్నారు.
అలా నవ్వడాన్ని జీర్ణించుకోలేక ఆయన తనను కించపరుస్తూ మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడే పద్దతి అదేనా ? అని ఆమె ప్రశ్నించారు. రాజ్యసభలో కాబట్టి ఆయన సేఫ్, ఇదే వ్యాఖ్య ఆయన బయట చేసి ఉంటే ఈపాటికి ఆయనపై చట్టప్రకారం కేసు నమోదై ఉండేదని ఆమె హెచ్చరించారు.