Andhra Pradesh: జైట్లీ ప్రకటనపై చంద్రబాబు అసంతృప్తి.. నిరసనలు కొనసాగించమని అధినేత ఆదేశం!
- దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు
- అక్కడి నుంచే టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన అధినేత
- పార్లమెంట్ లో నిరసనలు కొనసాగించాలి
- అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేసిన బాబు
లోక్ సభలో అరుణ్ జైట్లీ ప్రకటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరోజు పర్యటన నిమిత్తం దుబాయ్ వెళ్లిన చంద్రబాబుకు తాజా పరిస్థితుల గురించి పార్టీ ఎంపీలు ఆయనకు వివరించారు. లోక్ సభ వాయిదా అనంతరం తమ పార్టీ ఎంపీలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు కూడా పార్లమెంట్ లో నిరసనలు కొనసాగించాలని చెబుతూ, అనుసరించాల్సిన వ్యూహంపై ఈ మేరకు ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎంపీలు తమ కార్యాచరణను రూపొందించుకుంటున్నట్టు తెలుస్తోంది.