Andhra Pradesh: ఏపీ బంద్ లో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్త

  • వామపక్షాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న బంద్
  • బంద్ లో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్త రోశయ్య 
  • ఏపీ వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
ఏపీపై కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఏపీలో వామపక్షాలు ఈరోజు బంద్ తలపెట్టాయి. విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక లెనిన్ సెంటర్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్త కొణిజేటి ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ బంద్ కు తన మద్దతు తెలిపారు. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ తలపెట్టిన ఈ పోరాటానికి తెలంగాణ ఎంపీలు కూడా మద్దతు తెలపాలని కోరతానని అన్నారు.

 కాగా, ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. పలుచోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
Andhra Pradesh
TRS

More Telugu News