YSRCP: కేంద్రంలోని టీడీపీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలి: విజయసాయిరెడ్డి

  • కేంద్రంలో భాగస్వాములైన టీడీపీ నిరసన ఎలా వ్యక్తం చేస్తుంది?
  • మంత్రులు రాజీనామా చేసి ఆపై పోరాడాలి
  • టీడీపీ ఎంపీలు ఆడుతున్న నాటకాన్ని వ్యతిరేకిస్తూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తా: విజయసాయిరెడ్డి
కేంద్రం తీరుకు నిరసనగా టీడీపీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందిపోయి, ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలోని టీడీపీ మంత్రులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేసి పోరాటానికి దిగాలని అన్నారు.

టీడీపీ ఎంపీలు ఆడుతున్న నాటకాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో ఈరోజు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తామని అన్నారు. రాజ్యాంగంలోని 74, 75 ఆర్టికల్స్ ప్రకారం ఏ అంశమైనా కేబినెట్ లో ఆమోదం పొందిన తర్వాత దాన్ని వ్యతిరేకించడం అంటే నమ్మకాన్ని పోగొట్టుకోవడమేనని, ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తామని అన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ సుజనా చౌదరి గురించి ఆయన ప్రస్తావించారు. కాగా, కేంద్రంపై విశ్వాసం లేకపోతే కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి రాజీనామా చేయాలని రాజ్యసభలో విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. రాజ్యసభ చైర్మనే తమకు న్యాయం చేయకపోతే తాము ఎవరిని ఆశ్రయించాలని ఆయన ప్రశ్నించారు.
YSRCP
vijayasai reddy

More Telugu News