Delhi University: వేధింపులు తట్టుకోలేక... తరగతి గదిలోనే ప్రొఫెసర్‌ని యువ‌తి ఎలా కొట్టిందో చూడండి!

  • ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలో ఘటన
  • వీడియో వైరల్
  • ప్రొఫెసర్ చెంపఛెళ్లుమనించిన విద్యార్థిని
  • క్యాంపస్‌లో తోటి విద్యార్థులు నిరసన

ప్రొఫెసర్ పెడుతోన్న వేధింపులు తట్టుకోలేక త‌ర‌గ‌తి గ‌దిలోనే ఓ ప్రొఫెస‌ర్‌ని ఓ విద్యార్థిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువతి ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని భారతి కాలేజ్‌లో బీటెక్ మూడో సంవత్సర విద్యార్థిని అని తెలిసింది.

తరగతి గదిలోనే ప్రొఫెసర్ చెంపఛెళ్లుమనిపించి, నెట్టేసి ఆ యువతి అతడికి బుద్ధి చెబుతుండగా ఆమె స్నేహితులు ఈ వీడియో తీసినట్లు సమాచారం. ప్రొఫెసర్‌కి బుద్ధి చెప్పిన తరువాత ఆమె తమ వైస్ ఛాన్సలర్ కి ఓ లేఖ రాసి ఫిర్యాదు చేసి, అతడిపై చర్యలు తీసుకోమని కోరింది. ఈ ఘటనపై క్యాంపస్‌లో తోటి విద్యార్థులు నిరసన తెలిపారు.  

More Telugu News