Rahul Gandhi: నాకింకే సందేహం లేదు... ఇక నా బాస్ కూడా రాహుల్ గాంధీయే: సోనియా కీలక వ్యాఖ్య

  • నాపై చూపిన విశ్వాసాన్నే రాహుల్ పైనా చూపండి
  • కాంగ్రెస్ ఎంపీలతో సోనియాగాంధీ
  • పార్లమెంట్ లో ఎంపీలతో సమావేశం
గడచిన 19 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తన కనుసన్నల్లో పార్టీని నడిపించిన సోనియాగాంధీ, ఇటీవలే ఆ బాధ్యతలను స్వీకరించిన తన కుమారుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తనకు రాహుల్ గాంధీయే బాస్ అని ఆమె అన్నారు.

"నా బాస్ కూడా రాహుల్ గాంధీయే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరంతా ఆయనతో కలసి నడుస్తారని నాకు తెలుసు. నాపై చూపించిన నమ్మకాన్ని, విశ్వాసాన్నే రాహుల్ పైనా చూపుతారని అనుకుంటున్నా" అని కాంగ్రెస్ ఎంపీలతో పార్లమెంట్ లో సమావేశమైన సోనియా వ్యాఖ్యానించారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని అందుకుంటుందన్న విశ్వాసం తనకుందని అన్నారు. కాగా, తన 71 ఏళ్ల వయసులో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను గత సంవత్సరం చివర్లో రాహుల్ గాంధీకి సోనియా అప్పగించిన సంగతి తెలిసిందే.
Rahul Gandhi
Sonia Gandhi
Congress

More Telugu News