Andhra Pradesh: సస్పెండ్ చేసినా, డిస్మిస్ చేసినా భయపడే ప్రసక్తే లేదు: టీడీపీ నేత సీఎం రమేశ్

  • ఏపీకి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు
  • మమ్మల్ని మార్షల్స్ లాక్కెళుతుంటే ఇతర పార్టీల వారు అడ్డుపడ్డారు
  • వైసీపీ విజయసాయిరెడ్డి మాత్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరించారు: సీఎం రమేశ్
ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఉభయసభల్లో టీడీపీ, వైసీపీ ఎంపీలు తమ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభలో టీడీపీ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, సీతారామలక్ష్మి తమ ఆందోళనను కొనసాగించడంతో వారిని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభ నుంచి సస్పెండ్ చేశారు.

అనంతరం, మీడియాతో సీఎం రమేశ్ మాట్లాడుతూ, ఏపీకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. సభ నుంచి తమను మార్షల్స్ బయటకు లాక్కెళుతుంటే, ఇతర పార్టీల ఎంపీలు అడ్డుకున్నారు కానీ, విజయసాయిరెడ్డి మాత్రం తనకేమీ పట్టనట్టుగా వ్యవహరించారని ఆయన అన్నారు.
Andhra Pradesh
Telugudesam
CM Ramesh

More Telugu News