CM Ramesh: సీఎం రమేశ్ సహా టీడీపీ రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్!

  • 'బడ్జెట్‌పై ఏపీకి అన్యాయం'పై రాజ్యసభలో ఆందోళన తెలిపిన టీడీపీ ఎంపీలు
  • సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, సీతారామ లక్ష్మి సస్పెన్షన్
  • లోక్‌సభలో మాట్లాడుతోన్న ఏపీ ఎంపీలు
ఇటీవ‌ల పార్ల‌మెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌వేశ‌పెట్టిన వార్షిక‌ బ‌డ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన తెలుపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడుతున్నారు. మరోవైపు రాజ్యసభలో టీడీపీ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, సీతారామలక్ష్మి తమ ఆందోళనను కొనసాగించడంతో వారిని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
CM Ramesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News