Andhra Pradesh: అమరావతిలో 'అమృత విద్యాపీఠం' క్యాంపస్ కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు

  • రాజధాని ప్రాంతంలో 14 వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయి
  • రూ.34 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం
  • అమరావతిలో ఈ సంస్థ ఏర్పాటు కావడం సంతోషంగా ఉంది : చంద్రబాబు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగళ్లులో అమృత విద్యా పీఠం, అమరావతి క్యాంపస్ కు సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో 14 వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయని, రూ.34 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అమృత విద్యాపీఠం విలువలతో కూడిన విద్యను అందించడం దాని ప్రత్యేకతని, అమరావతిలో ఈ సంస్థ ఏర్పాటు కావడం తనకు సంతోషంగా ఉందని అన్నారు.

ముందుగా ఇంజనీరింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఆర్ట్స్ విభాగాల్లో కోర్సులు ఉంటాయని తెలిపారు. అమృతానందమయి సంస్థ విద్యారంగం, ఆధ్యాత్మిక రంగంలో ముందుందని చంద్రబాబు కొనియాడారు. రాజధాని ప్రాంతంలో ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాలు, వినోద సౌకర్యాలు, 1600 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
Andhra Pradesh
Chandrababu
amaravathi

More Telugu News