vinayak: మహేశ్ బాబుకి మా కథ నచ్చలేదు.. అందుకే పట్టాలెక్కలేదు!: వీవీ వినాయక్

షార్ట్స్‌లో చూడండి
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా వినాయక్ దర్శకత్వంలో 'ఇంటిలిజెంట్' సినిమా రూపొందింది. ఈ సినిమా ఈ నెల 9వ తేదీనే విడుదల కానుండటంతో, ప్రమోషన్స్ లో వినాయక్ చురుకుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే .. మహేశ్ తో ఆయన చేయవలసిన సినిమా ఎందుకు ఆగిపోయిందనే ప్రశ్న ఎదురైంది.

 అప్పుడాయన స్పందిస్తూ .. " మహేశ్ బాబుతో ఒక సినిమా చేయాలనుకున్న మాట వాస్తవం. ఆయనతో కథా చర్చలు కూడా జరిగాయి. అయితే ఆ కథ అంతగా మహేశ్ కి నచ్చలేదు .. అందుకే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తనకి ఆ కథ అంతగా నచ్చలేదనీ .. మరో కథ రెడీ చేయమని అప్పట్లో మహేశ్ చెప్పాడు. కుదిరితే తప్పకుండా చేస్తానని అన్నాడు. వీలు చూసుకుని ఆయన కోసం ఓ కథను సిద్ధం చేస్తాను" అని చెప్పాడు.  వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు తన సినిమాను పూర్తిచేసేలోగా, ఆయన కోసం వినాయక్ కథను సిద్ధం చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.     
Go Back to Shorts
vinayak
Mahesh Babu

More Telugu News