suman: నిజమైన ఆప్తులు ఎవరన్నది నాకు అప్పుడే తెలిసింది!: సినీ నటుడు సుమన్

  • శారీరకంగా .. మానసికంగా మరింత బలపడ్డాను
  • ఎవరితో ఎలా మసలుకోవాలనేది అర్థమైంది 
  • సినిమాల్లోకి వచ్చినందుకు గర్వపడుతున్నాను
సుమన్ హీరోగా ఎదుగుతూ ఉండగా .. ఆయన అభిమానుల సంఖ్య పెరుగుతూ ఉండగా ఆయన ఒక కేసులో జైలుకు వెళ్లారు. ఆ తరువాత నిర్దోషిగానే ఆయన బయటికి వచ్చారు. ఆ సంఘటన తరువాత నేర్చుకున్నదేవిటి? అనే ప్రశ్న ఆయనకి తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది.

అప్పుడు సుమన్ స్పందిస్తూ .. "ఈ సంఘటన జరగడం వలన జీవితమంటే ఏమిటో నాకు తెలిసి వచ్చింది. శారీరకంగా .. మానసికంగా నేను మరింత బలపడ్డాను. ఈ మొత్తం ఎపిసోడ్ లో నాకు కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి. దాంతో నాకు నిజమైన ఆప్తులు ఎవరనే విషయం అర్థమైంది. ఎవరితో ఎలా మసలుకోవాలి? అనే విషయం తెలిసింది. నేను సినిమాల్లోకి రావడం వల్లనే నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని నేను అనుకోవడం లేదు. ఎలాంటి నేపథ్యం లేకుండగా వచ్చి 40 సంవత్సరాల కెరియర్ ను ఇక్కడ కొనసాగిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతుంటాను" అని చెప్పుకొచ్చారు.      
suman

More Telugu News