raghuveera reddy: రేపు అందరూ తరలిరండి.. రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయండి: ఏపీసీసీ అధ్య‌క్షుడి పిలుపు

  • కేంద్ర బ‌డ్జెట్లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని నిర‌సిద్దాం
  • ప్ర‌జా పోరాటాల ద్వారానే రాష్ట్రాన్ని కాపాడుకుందాం
  • 8న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయండి
  • పోరాడతామనే జగన్ మాటలు అబద్ధాలేనని తేలిపోయాయి
కేంద్ర బ‌డ్జెట్లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని నిర‌సిద్దామ‌ని, ప్ర‌జా పోరాటాల ద్వారానే రాష్ట్రాన్ని కాపాడుకుందామ‌ని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. రేపు నిర్వ‌హించ‌ త‌ల‌పెట్టిన‌ రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లులోని అంశాలన్నీ అమలు చేయాలని, రాష్ట్రంలోని ఎంపీలందరూ రాజీనామా చేయాలని ఆయ‌న అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తీవ్రంగా అన్యాయం జరిగిందన్నారు.

విభజన చట్టంలోని చట్టబద్ధమైన అంశాలకు కేటాయింపులు లేకపోవడం ప్రజలందరినీ బాధించిందని రఘువీరారెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని నమ్మించిన 'మోదీ- బాబు' జోడీ.. వారిని గెలిపించిన వారికి నిరాశే మిగిల్చిందన్నారు. మడమ తిప్పకుండా మాట తప్పకుండా పోరాడతామనే జగన్ మాటలు అబద్ధాలేనని తేలిపోయాయ‌న్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతోన్న కాంగ్రెస్‌తో ప్రజలు కలిసి రావాలని, రేపు నిర్వహించే బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
raghuveera reddy
Congress
Andhra Pradesh

More Telugu News