Hyderabad: ఆ పని చేసుంటే కొడుకు, కోడలు నాకు వద్దేవద్దు: గ్రహణ బలిచ్చిన రాజశేఖర్ తల్లి

  • పోలీసులు నా కొడుకును తీవ్రంగా హింసిస్తున్నారు
  • చెయ్యని నేరాన్ని చేశానని చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు
  • పోలీసులపై రాజశేఖర్ తల్లి ఆరోపణలు
తన కుమారుడు ఓ చిన్నారిని తెచ్చి బలిచ్చాడంటే నమ్మబోమని, పోలీసులు తీవ్రంగా కొట్టి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని గ్రహణ బలి ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ తల్లి ఆరోపించింది. ఒకవేళ ఆ బలి తన కుమారుడే ఇచ్చుంటే, అతను, తన కోడలు కూడా అక్కర్లేదని అమె చెప్పింది. ఈ ఉదయం ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, తన ఇంట్లో ఎటువంటి పూజలు జరగలేదని స్పష్టం చేసింది.

పోలీసులు తనను కూడా ప్రశ్నించారని, ఈ బలి తామివ్వలేదనే చెప్పామని, తాము చేశామని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పింది. తన కుమారుడికి పిల్లలు లేకపోవడంతో వివిధ ప్రాంతాల్లోని దేవాలయాలకు వెళ్లి వస్తాడని, ఎన్నడూ క్షుద్రపూజలు చేయలేదని అన్నారు. పోలీసులు తన కుమారుడిని బాగా కొడుతున్నారని, చెయ్యని నేరాన్ని చేసినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
Hyderabad
Police
Grahana Bali
Rajashekar

More Telugu News