Anchor Anasuya: అనసూయ ఫోన్ పగలగొట్టడాన్ని చూశానన్న యువకుడు... వివరాలు చెప్పాలని కోరిన పోలీసులు!

  • అనసూయ ఫోన్ పగలగొట్టినట్టు ఆరోపణలు
  • ఆరోపణలను ఖండించిన అనసూయ
  • తాను చూశానని చెప్పిన ఓ యువకుడు
  • వివరాలు సేకరిస్తున్నామన్న పోలీసులు
హైదరాబాద్ లోని తార్నాక సమీపంలో నటి, యాంకర్ అనసూయను చూసిన ఆనందంలో తన కుమారుడు సెల్ఫీకి ప్రయత్నించగా, తీవ్ర ఆగ్రహంతో అనసూయ ఫోన్ పగలగొట్టినట్టు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అనసూయ సైతం స్పందిస్తూ, సెల్ఫీ దిగే పరిస్థితుల్లో తాను లేనని, వెళ్లిపోవాలని వారికి చెప్పి కారులోకి ఎక్కానని, ఫోన్ పగిలిందా? లేదా? అన్న విషయం తనకు తెలియదని చెప్పింది.

ఇక, ఓ యువకుడు అనసూయను, హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ, బాలుడి ఫోన్ ను ఎందుకు పగలగొట్టావు? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించి కలకలం రేపాడు. ఆ సమయంలో తాను అక్కడే ఉండి ఘటనను చూశానని చెప్పాడు.  హైదరాబాద్ పోలీసులు సైతం అతని ట్వీట్ పై స్పందించి, పూర్తి వివరాలు చెప్పాలని రిప్లయ్ ఇచ్చారు. సదరు యువకుడి నుంచి సమాచారాన్ని సేకరిస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Anchor Anasuya
Tarnaka
Cell Phone

More Telugu News