Chandrababu: జగన్ ను ఓ కంట కనిపెట్టండి: చంద్రబాబు

  • జగన్ రాజకీయ ఎత్తుగడలను ఎండగట్టండి
  • కేసుల నుంచి బయటపడేందుకు తంటాలు పడుతున్నారు
  • మోదీ ప్రాపకం కోసం వైసీపీ గుంటనక్క వేషాలు వేస్తోంది
ప్రధాని మోదీ ప్రాపకం కోసం వైసీపీ గుంటనక్క వేషాలు వేస్తోందని... ఇది అత్యంత హేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ప్రధానితో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశమైతే... సీబీఐ కేసులపై ప్రభావం పడే అవకాశముందని చెప్పారు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రధాని అపాయింట్ మెంట్ ను విజయసాయి కోరారనే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

 ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ విధంగా స్పందించారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు వైసీపీ నేతలు నానా తంటాలు పడుతున్నారని అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు చేస్తున్న నాటకాలను... ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. స్వప్రయోజనాల కోసం జగన్ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలను తూర్పారబట్టాలని పిలుపునిచ్చారు. జగన్ ప్రతి చర్యను ఓ కంట కనిపెట్టాలని... ఎవరికివారు దీనిపై స్పందించాలని సూచించారు.
Chandrababu
Jagan
Narendra Modi

More Telugu News