loksabha: లోక్ సభలో కాంగ్రెస్-టీడీపీ ఎంపీల మధ్య వాగ్వాదం

  • ఏపీకి అన్యాయం జరగడానికి కారణం కాంగ్రెస్సే  
  • టీడీపీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీలు
  • ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం..సభలో గందరగోళం
  • కొంచెం సేపు సభను వాయిదా వేసిన స్పీకర్
బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై లోక్ సభలో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి అన్యాయం జరగడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని టీడీపీ సభ్యులు ఆరోపించడంతో ఆ పార్టీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ-కాంగ్రెస్ ఎంపీల మధ్య వాగ్వాదం కారణంగా సభలో గందరగోళం నెలకొంది. దీంతో, సభను కాసేపు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. కాగా, రాజ్యసభలోనూ టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. టీడీపీ ఎంపీలు సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, సీతారామలక్ష్మి ప్లకార్డులు చేత బూని నిరసన తెలిపారు.
loksabha
Congress
Telugudesam

More Telugu News