Amitabh Bachchan: ఇతరులను ఫాలో అవడం తప్పా?: నెటిజన్లకు బిగ్ బి ప్రశ్న

షార్ట్స్‌లో చూడండి
నెటిజన్లపై బాలీవుడ్ బిగ్ బి కాస్త గుస్సా అయ్యారు. ప్రచారం కోసమే అమితాబ్ తన ట్విట్టర్ ఖాతాలో ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ ప్రముఖులను కూడా ఫాలో అవుతున్నారంటూ నెటిజన్లు చేస్తున్న విమర్శల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన ఇష్టపూర్వకంగానే ట్విట్టర్‌లో చాలా మంది ప్రముఖులను ఫాలో అవుతున్నట్లు ఆయన చెప్పారు. కానీ, చాలా మంది తన ఖాతా హ్యాకింగ్‌కు గురైందని కామెంట్ చేస్తున్నారని, అలాంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. 'ఇతరులను అనుసరించడం తప్పా? అలా అయితే, అలా అయితే లక్షలాది తప్పులు చేస్తా' అని బిగ్ బి అన్నారు. 

అమితాబ్ 6 పదుల వయసు దాటినా ఇప్పటికీ మిగిలిన యువ నటులకు ఏ మాత్రం తీసిపోకుండా పలు సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, బ్రహ్మాస్త్ర, 102 నాటౌట్, సైరా నరసింహారెడ్డి చిత్రాలతో ఆయన బిజీ బిజీగా ఉన్నారు.
Go Back to Shorts
Amitabh Bachchan

More Telugu News