lok sabha: లోక్‌సభలో ఖర్గే ఎదుట నిలబడి ప్లకార్డులు పట్టుకుని టీడీపీ సభ్యుల నిరసన.. మండిపడ్డ కాంగ్రెస్ నేత

  • రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రసంగం
  • లోక్‌సభలో మరోసారి కాంగ్రెస్-టీడీపీ ఎంపీల మధ్య వాగ్వివాదం
  • సభలో మోదీ, సోనియా
  • సభ్యుల ఆందోళన నేపథ్యంలో లోక్ సభ 3.30 గంటలకు వాయిదా
కేంద్ర బ‌డ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జ‌రిగింద‌ని లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో టీడీపీ ఎంపీలు నిర‌స‌న తెలుపుతోన్న విష‌యం తెలిసిందే. లోక్‌స‌భ‌లో మ‌రోసారి టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు వాగ్వివాదానికి దిగ‌డంతో స‌భ మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా పడింది. కాగా, ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ లోక్‌సభకు హాజరుకాగా వారి సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు వాగ్వివాదానికి దిగారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా ఆయన ఎదుట నిలబడి ప్లకార్డులు పట్టుకుని టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. దీంతో ఖర్గే మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరగడానికి కాంగ్రెసే కారణమని టీడీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలోనూ టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, సీతా రామలక్ష్మి ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. 
lok sabha
kharge
Telugudesam
Congress

More Telugu News