sai dharam tej: సాయిధరమ్ తేజ్ వెంటపడుతోన్న దర్శకులు .. చంద్రశేఖర్ యేలేటికి ఛాన్స్
- కరుణాకరన్ తో సినిమా చేస్తోన్న తేజు
- రీసెంట్ గా కథ వినిపించిన చంద్రశేఖర్ యేలేటి
- వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తేజు
కొంతకాలంగా సాయిధరమ్ తేజ్ కి సరైన హిట్ లేదు .. అయినా దర్శక నిర్మాతలు ఆయన వెంటపడుతున్నారు. పరాజయాలు పలకరిస్తున్నా మాస్ ఆడియన్స్ లో ఆయనకి గల క్రేజ్ ఎంతమాత్రం తగ్గకపోవడమే అందుకు కారణం. అన్ని రకాల కథలు ఆయన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవుతూ వుండటం మరో కారణం. ఆల్రెడీ సాయిధరమ్ తేజ్ .. కరుణాకరన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టును ఆయనతో చేయడానికి దర్శక నిర్మాతలు చాలామంది లైన్లో వున్నారు.
వాళ్లలో చంద్రశేఖర్ యేలేటికి ఛాన్స్ దక్కినట్టుగా సమాచారం. చంద్రశేఖర్ యేలేటి పేరు వినగానే 'ఐతే' .. 'అనుకోకుండా ఒక రోజు' .. 'మనమంతా' సినిమాలు గుర్తుకొస్తాయి. అలాంటి ఆయన రీసెంట్ గా సాయిధరమ్ తేజ్ ను కలిసి ఒక కథను వినిపించాడట. ఇంతవరకూ తాను చేయని పాత్ర కావడంతో, వెంటనే సాయిధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.