స్పీడ్ చూపిస్తోన్న సాయిధరమ్ తేజ్!
- కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్
- ఈ నెల 16వ తేదీ నుంచి తాజా షెడ్యూల్
- కథానాయికగా అనుపమ పరమేశ్వరన్
కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 16 నుంచి మొదలుకానుంది. ఇంతవరకూ సాయిధరమ్ చేస్తూ వచ్చిన పాత్రలకి ఈ సినిమాలోని పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.