Chittoor District: తలకి పిలక, రిబ్బన్ కట్టుకుని, చేతిలో చిడతలతో పార్లమెంట్ ముందు టీడీపీ ఎంపీ నిరసన

  • వినూత్నంగా నిరసన తెలిపిన చిత్తూరు ఎంపీ
  • పాటలు పాడిన ఎంపీ శివప్రసాద్
  • గాంధీ విగ్రహం ముందు మరోసారి టీడీపీ ధర్నా
ఏపీకి జరిగిన నష్టాన్ని వెంటనే పూడ్చాలని, తమ డిమాండ్లను బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చాలని కోరుతూ తెలుగుదేశం ఎంపీలు వరుసగా రెండో రోజూ పార్లమెంట్ లో నిరసన తెలిపారు. ఈ క్రమంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మరోసారి వినూత్నంగా పార్లమెంట్ కు వచ్చారు. తలకు వెంట్రుకలకు పిలక వేసుకుని, దానికో రిబ్బన్ కట్టుకుని, మెడలో పూలమాల, చేతిలో చిడతలు పట్టుకుని వచ్చి పాటలు పాడుతూ నిరసన తెలిపారు. టీడీపీ సభ్యులంతా గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతుంటే, "ఓం నమో నారా" అంటూ శివప్రసాద్ అటూ ఇటూ తిరుగుతూ హడావుడి చేశారు.
Chittoor District
MP Sivaprasad
Andhra Pradesh

More Telugu News