vjay hazare trophy: శభాష్ ఉన్ముక్త్ చంద్... దవడ పగిలినా సెంచరీ కొట్టాడు!

  • విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్
  • ప్రాక్టీస్ మ్యాచ్ లో బంతి బలంగా తగలడంతో దవడకు తీవ్రగాయం 
  • దవడకు కట్టుకట్టుకుని ఆడి, సెంచరీ చేసిన ఉన్ముక్త్ చంద్
అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌ పట్టుదలకు క్రికెట్ అభిమానులు క్లీన్ బౌల్డ్ అయిపోయారు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ తో జరిగిన మ్యాచ్‌ కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో బంతి బలంగా తాకడంతో ఉన్ముక్త్ దవడకు తీవ్రగాయమైంది. అయినా విరామం తీసుకోకుండా దవడకు కట్టుకట్టుకుని మ్యాచ్ లో ఓపెనర్‌ గా దిగిన ఉన్ముక్త్ చంద్ 125 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 116 పరుగులు చేశాడు.

గాయం బాధిస్తున్నా లెక్కచేయకుండా ఆడిన అతని ధైర్యానికి క్రికెట్ అభిమానులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అతని సెంచరీతో ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేయగా, ఉత్తరప్రదేశ్ కేవలం 252 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ విజయం సాధించింది. అత్యంత ధైర్యం ప్రదర్శించిన ఉన్ముక్త్ చంద్ ను క్రీడాభిమానులు ప్రశంసిస్తున్నారు. 
vjay hazare trophy
delhi vs uttarpradesh
unmukt chand

More Telugu News