rajnath singh: త్వరలోనే రాజకీయ పరమైన నిర్ణయాలు: టీడీపీ ఎంపీలతో రాజ్‌నాథ్ సింగ్

  • బడ్జెట్‌పై ఏపీకి అన్యాయం నేపథ్యంలో రాజ్‌నాథ్‌తో టీడీపీ ఎంపీల భేటీ
  • టీడీపీ నేతలతో కలిసి విస్తృతంగా చర్చించి ఓ నిర్ణయానికి వస్తాం-రాజ్‌నాథ్
  • టీడీపీ నేతల నిరసనల అంశాన్ని అమిత్ షా నిశితంగా పరిశీలిస్తున్నారు
  • ఏపీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలకు త్వరలోనే పరిష్కారం 
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని మండిపడుతోన్న టీడీపీ ఎంపీలు ఈ రోజు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం అయ్యారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను వారు రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ కీలక సూచనలు చేసినట్లు సమాచారం.

త్వరలోనే రాజకీయపరమైన పలు నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఏపీ టీడీపీ నేతలతో కలిసి విస్తృతంగా చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని అన్నారు. టీడీపీ నేతల నిరసనల అంశాన్ని తమ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నిశితంగా పరిశీలిస్తున్నారని అన్నట్లు తెలిసింది. ఏపీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. 
rajnath singh
Telugudesam
BJP

More Telugu News