manchu vishnu: మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతోన్న మంచు విష్ణు?

  • దర్శకత్వంపై తెలుగు హీరోల ఆసక్తి 
  • రంగంలోకి దిగనున్న మంచు విష్ణు 
  • త్వరలోనే పూర్తి వివరాలు
ఒక వైపున రచయితలు .. దర్శకులుగా మారుతుంటే, మరో వైపున దర్శకులు .. నిర్మాతలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది హీరోలు కూడా దర్శకత్వం వైపు ఆసక్తిని చూపుతున్నారు. తమిళంలో ధనుష్ .. శింబు దర్శకులుగాను ప్రయోగాలు చేస్తున్నారు. ఇక తెలుగులో రవితేజ .. నాని .. అల్లరి నరేశ్ .. రాజ్ తరుణ్ లు దర్శకత్వం పట్ల ఉత్సాహాన్ని చూపుతున్నారు.

ఈ క్రమంలో మంచు విష్ణు మెగా ఫోన్ పట్టనున్నట్టుగా ఫిల్మ్ నగర్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాతో త్వరలో విష్ణు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తరువాత 'ఓటర్' సినిమా లైన్లోనే వుంది. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడిగా ఒక సినిమా చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆయనే హీరోగా చేస్తాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.      
manchu vishnu

More Telugu News