Pawan Kalyan: ఏపీ మత్స్యకారులతో పవన్ కల్యాణ్ భేటీ!
తమ సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారులు నిరసనలు వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టిపెట్టాలని వారు కోరుతున్నారు. కాగా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల మత్స్యకారులు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌ని కలిసి చర్చిస్తున్నారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగుతోంది. మత్స్యకారులతో మాట్లాడుతూ పవన్ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కాగా, వివిధ వర్గాల వారి సమస్యలు తెలుసుకుని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ముందు ఉంచుతానని ఇటీవలే పవన్ కల్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే.