ఓవర్సీస్ లో 'భాగమతి' జోరు .. మిలియన్ డాలర్ మార్క్ ను దాటేసింది
- ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున 8 కోట్ల షేర్
- ఇంతవరకూ 30 కోట్ల షేర్
- ఓవర్సీస్ లోను కొనసాగుతోన్న జోరు
తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా ఓవర్సీస్ లో తన జోరు చూపిస్తోంది. నిన్నటి ఆదివారంతో ఈ సినిమా మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసిందని ట్రేడ్ పండితుల మాట. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక దక్షిణాది సినిమాకి, ఓవర్సీస్ లో ఈ స్థాయి వసూళ్లు లభించడం విశేషమని అంటున్నారు. కథాకథనాలు .. నేపథ్య సంగీతం .. అనుష్క అభినయం, ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు సాధించి పెడుతున్నాయని చెబుతున్నారు.