Mahesh Babu: బోయపాటికి నిర్మొహమాటంగా చెప్పేసిన మహేశ్ బాబు!

షార్ట్స్‌లో చూడండి
'బ్రహ్మోత్సవం' .. 'స్పైడర్' సినిమాలు భారీ పరాజయాలను తెచ్చిపెట్టడంతో, తరువాత ప్రాజెక్టులపై మహేశ్ బాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ కారణంగానే 'భరత్ అనే నేను'లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయనీ, వంశీ పైడిపల్లి ప్రాజెక్టుకి సంబంధించిన స్క్రిప్ట్ పై గట్టిగా కసరత్తు జరుగుతోందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే బోయపాటి శ్రీను .. మహేశ్ బాబును కలిసి ఒక కథను చెప్పాడట. కథ విన్న తరువాత విషయాన్ని ఎంత మాత్రం నాన్చకుండా, తనకి నచ్చలేదని మహేశ్ బాబు తేల్చి చెప్పేశాడని అంటున్నారు. ప్రస్తుతం వినిపించిన కథకు రిపేర్లు చేసే ప్రయత్నాలు చేయకుండా, కొత్తగా ఏదైనా లైన్ అనుకుని రమ్మని చెప్పాడట. దాంతో బోయపాటి శ్రీను ఆ దిశగా తన కసరత్తును మొదలెట్టాడని చెబుతున్నారు. ఈ వార్త బయటికి వచ్చిన దగ్గర నుంచి మహేశ్ బాబు ఇక మొహమాటాలకు పోవడం లేదని చెప్పుకుంటున్నారు.     
Go Back to Shorts
Mahesh Babu
boyapati

More Telugu News