India: టీడీపీ ఎంపీల నిరసనలో పాల్గొనని అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి

  • పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల నిరసన
  • గైర్హాజరైన కేంద్ర మంత్రులు
  • వెంటనే ఏపీని ఆదుకోవాలని ఎంపీల డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని, విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ముందు ధర్నా చేస్తున్న వేళ, ఆ పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి గైర్హాజరు కావడం గమనార్హం. వారిరువురూ తమ కార్యాలయాల్లోనే ఉండిపోయారు.

 ఆందోళనలకు వారు దూరంగా ఉండటంపై పార్టీ నేతలు స్పందిస్తూ, కేంద్ర మంత్రులుగా ఉన్న కారణంగానే వారు ధర్నాలో పాల్గొనలేదని వెల్లడించారు. పార్లమెంట్ ముందు ధర్నాలో ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, టీజీ వెంకటేష్, తోట నరసింహం, ఎన్. శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
India
Andhra Pradesh
Parliament
Telugudesam
Protest

More Telugu News