amalapauk: శభాష్! అమలాపాల్: నడిగర సంఘం అభినందన

  • అమలాపాల్ ను అభినందించిన నడిగర్ సంఘం
  • అమలాపాల్ ధైర్యంగా ముందుకు రావడం అభినందనీయం
  • పోలీసులకు కృతజ్ఞతలు
సినీ నటి అమలాపాల్ ను నడిగర్ సంఘం అభినందించింది. రెండు రోజుల క్రితం లైంగిక వేధింపులకు గురై, ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంపై నడిగర్ సంఘం ఆమె ధైర్యానికి మెచ్చుకుంది. దీనిపై ప్రకటన విడుదల చేసిన నడిగర్ సంఘం లైంగిక వేధింపులపై పలువురు నటీమణులు బయటకు మాట్లాడేందుకు వెనకాడుతున్న తరుణంలో తనకు జరిగిన వేధింపులపై అమలాపాల్‌ ధైర్యంగా ముందుకురావడం అభినందనీయమని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన మాంబళం ఇన్‌ స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ లు నిందితుడ్ని అరెస్టు చేసినందుకు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపింది.
amalapauk
harassment
nadighar sangham

More Telugu News