Brahmanandam: ఇంతవరకూ ఇల్లే లేదు .. ఇక కాంపౌండ్ ఎలా ఉంటుంది?: బ్రహ్మానందం

  •  బ్రహ్మానందం అంటే అందరికీ ఇష్టమే 
  • ఆయన సెట్లో వుంటే సందడే సందడి 
  • నాలుకను అదుపులో వుంచడం మంచిదన్న బ్రహ్మానందం
బ్రహ్మానందం నడిచే గ్రంధాలయం అని ఆయనతో పరిచయం వున్న వారు చెబుతుంటారు. ఇక తెరపైనే కాదు .. బయట కూడా ఆయన చమత్కారాలు తెగ నవ్వించేస్తూ వుంటాయని ఆయనతో కలిసి పనిచేసినవాళ్లు అంటుంటారు. ఆయన సెట్లో వుంటే సందడే సందడి .. అదో షూటింగులా కాకుండా పిక్నిక్ మాదిరిగా ఉంటుందని తోటి కమెడియన్స్ చెబుతుంటారు. తనకి గల అనుభవంతో అసహజత్వానికి ఆస్కారం లేకుండా సహజత్వానికి ఆయన ప్రాధాన్యతనిస్తూ వెళుతుంటారు.

"ఇండస్ట్రీలో హీరోల కాంపౌండ్ గొడవలు ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయా?" అనే ప్రశ్న తాజాగా ఆయనకి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. " ఇంతవరకూ ఇల్లే లేదు ..  ఇక కాంపౌండ్ గురించిన ఆలోచన ఎందుకు?" అంటూ ఆయన చమత్కరించారు. అయినా మన నాలుక  అదుపులో ఉండాలే గానీ, ఎలాంటి చీకాకులు దరిచేరవు" అని ఆయన తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు.  బ్రహ్మానందం త్వరలో 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాతో ప్రేక్షకులముందుకు రానున్నారు.      
Brahmanandam

More Telugu News