Mahesh Babu: మహేష్ బాబు ఒక్క జోక్ వేస్తే చాలు మొత్తం 'సెట్' అయిపోయేది!: కైరా అద్వానీ

  • భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్న కైరా అద్వానీ
  • మహేష్ బాబుపై కైరా పొగడ్తలు
  • చరణ్ సరసన మరో సినిమా 
ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబుపై 'భరత్ అనే నేను' సినిమా నాయిక కైరా అద్వానీ పొగడ్తలు కురిపించింది. సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ, ఉదయం నుంచి సాయంత్రం వరకూ చిత్రీకరణలో ఎవరెంత పని చేసినా, ఎంత కష్టపడినా, మహేశ్‌ ఒక్క జోక్‌ వేస్తే చాలు, సెట్‌ లోని అందరూ నవ్వుల్లో తేలిపోయి కష్టం మర్చిపోతారని చెప్పింది. సెట్ లో మహేశ్‌ ఉంటే ఎంతో పాజిటివ్‌ ఎనర్జీ వచ్చేస్తుందని తెలిపింది. సినిమాలో మహేష్ బాబు బాగా లీనమవుతారని చెప్పింది.  

సన్నివేశం బాగా రావాలంటే అందులోని ప్రతి ఒక్కరూ బాగా నటించాలని, అందరి షాట్స్‌ చక్కగా రావాలని కోరుకునే వ్యక్తి మహేష్ బాబు అని, అందుకే ప్రతి ఒక్కరి క్లోజప్ షాట్స్ నూ మానిటర్ లో చెక్ చేస్తాడని తెలిపింది. అసలు తాను దక్షిణాది సినిమాల్లో నటిస్తానని ఊహించలేదని, కొరటాల శివ చెప్పిన కథ నచ్చడంతో నటించేందుకు అంగీకరించానని కైరా అద్వానీ చెప్పింది. దీని తరువాత రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందించే సినిమాలో కూడా ఆమె నటించనుంది. 
Mahesh Babu
Koratala Siva
Bharath Ane Nenu
kaira advani

More Telugu News